swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 7:35 am Digital Edition : SWARNA SAGARAM MEDIA

అంబేద్కర్ భవన స్థలం ఆక్రమణకు గురి కాకుండా చూడండి సారూ

రామకుప్పం స్వర్ణ సాగరం ఫిబ్రవరి 28

కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో భూ కబ్జాదారుల ఆగడాలు రానురానుఎక్కువైపోతున్నాయి,
దళితుల స్మశానాలు, హాస్టల్లోస్థలాలు, చివరికి, దేశానికి దశ దిశ నిర్దేశాన్ని చూపిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవన స్థలాన్ని కూడా కబ్జాదారులు వదలడం లేదు..

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో శనివారం కొంతమంది భూ కబ్జాదారులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనానికి కేటాయించిన స్థలాన్ని కబ్జాచేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బహుజనసేన నాయకులు వెంటనే కుప్పం నియోజకవర్గ ఆర్డిఓ విజయలక్ష్మి మేడంన్ని కలసి సంబంధిత విషయంపై వివరించడం జరిగింది ఆ స్థలానికి సంబంధించినటువంటి పత్రాలు కూడా సమర్పించడం అయినది. బందార్లపల్లి పంచాయతీ లెక్క దాఖలా 577 సర్వేనెంబర్ సోషల్ వెల్ఫేర్ కి సంబంధించిన స్థలాన్ని గత 2024 సంవత్సరం నందు అప్పటి మండల తాసిల్దార్ విఆర్ఓ సర్వేర్ల ఆధ్వర్యంలో సర్వే చేయించి కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జెసిబి ద్వారా కంచి కూడా వేయడం జరిగింది. అనంతరం భవనం కొరకు అప్పటి ప్రభుత్వం ఎంపీ నిధులతో 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అప్పటి ఇంజనీర్ భవనానికి డబ్బులు సరిపోదని మరల నిధులు కావాలంటూ ఎస్టిమేషన్ గవర్నమెంట్ కు పంపడం జరిగింది ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత అప్పటి ప్రభుత్వం మారిపోవడంతో పనులు ప్రారంభించలేకపోయారు ఇప్పటి కూటమి ప్రభుత్వమైన రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు పట్టుపత్రులు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వార్లు దయతలచి భవనానికి నిధులు మంజూరుచేసి భవనం పూర్తి చేయించే దిశగాతీసుకు వెళ్లాలని తమవారిని ఎస్సీ ఎస్టీ గిరిజన బహుజనుల సంఘాల కల నెరవేరుస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము

సామాజిక ఉద్యమ వందనాలతో
రామకుప్పంమండల
దళిత గిరిజన సంఘాల నాయకులు