కోట స్వర్ణసాగరం మార్చి 19
కోట మండలం కోట గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానం నందు గురువారం ఉగాది పర్వాదినాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ అధ్యక్షులు విశ్వనాధం నాగరాజు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పండితులు ఉదయం అమ్మవారికి అభిషేకములు మరియు అలంకరణ,నైవేద్యం,మంగళహారతి, సాయంత్రం సంకల్పము,గణపతి పూజ,
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి సహస్రనామ కుంకుమార్చన,పంచాంగశ్రవణము, మంగళహారతి,కార్యక్రమాలు జరిపి అనంతరం అమ్మవారి పల్లకీసేవను నిర్వహించి భక్తులు తీర్థప్రసాదాలు అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.