swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 20 March 2026, 9:00 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమక్షంలో తిరుమలశెట్టి కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు

కోట స్వర్ణసాగరం మార్చి 19

కోట మండలం కోటలో గురువారం తెలుగుదేశంపార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు జన్మదిన వేడుకలు గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సమక్షంలో ఘనంగా జరిగాయి.కోటలో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి సునీల్ కుమార్ విచ్చేసిన సందర్భంగా గ్రీన్ ఫౌండేషన్ అధినేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో తిరుమలశెట్టి కోటేశ్వరరావు కేక్ కట్ చేశారు.ఎమ్మెల్యే సునీల్ కుమార్ తిరుమలశెట్టి కోటేశ్వరరావుకు కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తిరుమలశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రజా నాయకుడు గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సమక్షంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ నేపథ్యంలో తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులకు మిత్రులకు ముఖ్యంగా టీడీపీ నేత జలీల్ అహ్మద్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.