ఏర్పేడు మండలంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా…

స్వర్ణసాగరం ఏర్పేడు, మార్చి 29. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పేడు మండలంలోని కోభాక, కొత్త వీరాపురం, సీతరాంపేట, ఏర్పేడు, పార్టీ కార్యాలయం, మేర్లపాక, మన్నసముద్రం గ్రామాలలో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పేడు టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు గారు పలు గ్రామాలలో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు పార్టీ స్థాపకుల ఆశయాలను స్మరించుకుంటూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు...