swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 12:44 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర పరిశీలకులుగా డాక్టర్ తిరుమశెట్టి కోటేశ్వరరావు

కోట స్వర్ణసాగరం మార్చి 15

హైదరాబాద్ ఎఫ్.టి.సి.సి.ఐ భవనంలో నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో శనివారం  జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ చింత విజయ ప్రతాపరెడ్డి మరియు తెలంగాణ అడిషనల్ డీసీపీ రామదాసు తేజావత్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి చంద్రశేఖర్  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.కోట మండలం కోట గ్రామానికి చెందిన డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు వినియోగదారుల హక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసినందుకు గాను,నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర పరిశీలకులుగా డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు అతిధిల చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.అదేవిధంగా నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ రాష్ట్ర పరిశీలకులుగా రెండవసారి తిరుమలశెట్టి కోటేశ్వరరావు ఎంపికయ్యారు.నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ లో తిరుమలశెట్టి కోటేశ్వరరావు సేవలను గుర్తించిన చైర్మన్ నాగేశ్వరరావు 2 వ సారి అవకాశం కల్పించారు.ఈ సందర్భంగా తిరుమలశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో రెండవసారి అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.తనకు అప్పగించిన బాధ్యతలపై బాధ్యతాయుతంగా పనిచేసే సంస్థకు మంచి పేరు తీసుకుని వస్తారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తిరుమలశెట్టి కోటేశ్వరరావు, అనుచరులు,స్నేహితులు,బంధువులు,కోట పట్టణ ప్రజలు ఆయన కి శుభాకాంక్షలు తెలిపారు.