swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 31 March 2026, 9:41 pm Digital Edition : DAMA VIJAYAKUMAR

కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్..

మనుబోలు, స్వర్ణసాగరం :

మండలంలోని కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో మిల్క్ ట్యాంకర్ బోల్తా పడింది. దీనితో పలు రైళ్లకు అంతరాయం కలిగింది. విజయవాడ నుంచి తిరుమలకు పాలతో వెళుతున్న రైల్వే పాల ట్యాంకర్ 152/11బి కిలోమీటర్ వద్ద ఉన్న రైల్వే జంక్షన్ వద్ద గూడ్స్ పట్టాలు తప్పింది. అదుపు తప్పి పాల ట్యాంకర్ బోల్తా పడింది. అప్ లైన్ లో విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పలు రైళ్లకు అంతరాయం కలిగింది. జీఆర్పి, ఆర్ పి ఎఫ్ పోలీస్ అధికారులు అక్కడకు చేరుకున్నారు. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు.