కోడిని కోస్తే జైలు.. డ్రగ్స్ వాడితే బెయిలు
ఇదేనా కూటమి రాజకీయం ఎక్స్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమరావతి : రాష్ట్రంలో కోడిని కోసిన వ్యక్తిని జైలుపాల్జేసి తీవ్రంగా కొట్టి రోడ్లపై నడిపించారని, అదే ఒక ఎంపి డ్రగ్స్ తీసుకుని దొరికితే హాట్‌లైన్లో బెయిలిప్పించి షోకాజ్ పేరుతో డ్రామా ఆడుతున్నారని వైసిపి అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై సోమవారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు. డ్రగ్స్‌పై పోరాటం అంటూనే డ్రగ్స్ వాడుతూ యువతకు ఇచ్చే సందేశం ఏమిటన్నారు. హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపి పుట్టా మహేష్ దొరికారని,...