swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 1:13 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

గండవరం సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

కోట స్వర్ణసాగరం మార్చి 27

కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ పూజ కార్యక్రమానికి గండవరం సుష్మారెడ్డి మూడు రోజులు జరిగే కావమ్మ భజన కథకు 5000 రూపాయలు విరాళం అందించారు.అన్నదాన కార్యక్రమానికి తీర్థ ప్రసాదములు నైవేద్యాలకు ఉభయ ధాతగా వ్యవహరించారు.ఆలయ ప్రధాన అర్చకులు కారంపూడి శివ శంకర్ శర్మ ఆంజనేయస్వామి కి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి సుష్మా రెడ్డికి భక్తులకు హారతులు తీర్ద ప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా గండవరం సుష్మా రెడ్డి మాట్లాడుతూ తిన్నెలపూడి గ్రామపంచాయతీ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ప్రజలందరిపై శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ రాముడిని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న అన్న ప్రసాదమును స్వీకరించారు.