కోట స్వర్ణసాగరం మార్చి 9
కోట మండలం తిన్నెలపూడి పంచాయతీ పరిధిలోని తిన్నెలాపూడి గ్రామంలో టీడీపీ కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన మహిళా నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు సుష్మా రెడ్డి తీన్మార్ బ్యాండ్ సెట్ బాణసంచా వేడుకలతో గజ పూలమాలవేసి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్ర ఉన్న పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ సంతోషంగా ఉండాలని సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గత ప్రభుత్వం రీ సర్వేలో జరిగిన తప్పులను సరిచేసి కూటమి ప్రభుత్వంలో రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా 7438 పాస్ పుస్తకాలు అందులో కోట మండలంలో 885 పాస్ పుస్తకాలు పంచాయతీలో 242 పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.తిన్నెలపూడి గ్రామంలో ఉన్న సిమెంట్ రోడ్లు గాని,పక్కా గృహాలు, డ్రైనేజీ కాలవలు గాని గత టిడిపి ప్రభుత్వంలో జరిగిన అభివృద్దే కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకంలో ఇచ్చిన హామీలను అన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారని కూటమి ప్రభుత్వం చేసిన చేస్తున్న అభివృద్ధిని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జయ జయ రావు,జిల్లా మైనారిటీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్,మద్దాలి సర్వతోమరెడ్డి,నెల్లూరు మోహన్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి,మారంరెడ్డి శ్రీధర్ రెడ్డి,మర్రి ప్రమీల,పురిణి శ్రీనివాసులు, వరాల బాలాజీ,తిరుమలశెట్టి కోటేశ్వరరావు ఎంపీటీసీలు షేక్ షంషుద్దీన్,దారా సురేష్, టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.