గ్యాస్ కొరత – కార్మికుల జీవనాధారంపై దెబ్బ ..!
విజయవాడ : మిడిల్‌ఈస్ట్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం దేశవ్యాప్తంగా కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. అంతర్జాతీయంగా ఎల్‌పిజి సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడటంతో దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత పెరిగింది. దీని కారణంగా చిన్న హోటళ్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్లు తమ కార్యకలాపాలు తగ్గించుకోవాల్సి రావడంతో ఫుడ్ డెలివరీ ఆర్డర్లు గణనీయంగా పడిపోయాయి. ఒకటేమిటీ … చిన్న బండ్ల వ్యాపారాల నుండి పెద్ద రెస్టారెంట్ల వరకు పొట్టపోషించుకునే కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది..! అక్రమ వ్యాపారాలు, బ్లాక్ మార్కెట్లు …. గ్యాస్ కొరతను అవకాశంగా...