కోట స్వర్ణసాగరం మార్చి 19
కోట మండలం కోటలోని ఎస్ కే బి ఆవరణంలో గురువారం గ్రీన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో కోట వాకాడు చిట్టమూరు మండలాలలోని నిరుపేద ముస్లిం మహిళలు 600 మందికి రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రంజాన్ తోఫా ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఎమ్మెల్యేకు గ్రీన్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు పూలమాలలు శాలవాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోనే మంచి మానవతా దృక్పథం మంచి మనసు కలిగిన ముస్లిం సోదరుడు ఒక్క గ్రీన్ ఫౌండేషన్ అధినేత జలీల్ అహ్మద్ ఒక్కరేనని అన్నారు. గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా వంటి భయంకరమైన మహమ్మారి రాష్ట్రాన్ని గడగడా వనికిస్తున్న సమయంలో జలీల్ అహ్మద్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను అందించి మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు.గ్రీన్ ఫౌండేషన్ సొంత ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాల నుండి వందల మంది నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా సరుకులను అందించడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,మాజీ అధ్యక్షులు సర్వోత్తమ రెడ్డి,జిల్లా రైతు విభాగం కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి,వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్,వాకా విజయభాస్కర్ రెడ్డి మండల రైతు అధ్యక్షులు మారం రెడ్డి శ్రీధర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి కోటారెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి డా,తిరుమల శెట్టి కోటేశ్వరరావు, ఎంపీటీసీలు శంషుద్దీన్,దారా సురేష్,నౌషాద్ భాషా,కోట మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మధుబాబు,నాయబ్ రసూల్, అక్బర్ బాష, సిద్దపరెడ్డి పోలమ్మ,సుహాసిని, వంశీ,చాపల శ్రీనివాసులు,రూపేష్,గ్రీన్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు,టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.