swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:30 am Digital Edition : DAMA VIJAYAKUMAR

ఘనంగా తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం

వ్యస్థాపకుడు నందమూరి తారకరామారావు చిత్రపటానికి నివాళులు

– దువ్వూరు మధుసూదన్ రెడ్డి

స్వర్ణసాగరం వాకాడు

మండల కేంద్రం లోని నెల్లిపూడి పంచాయతీ పరిధిలోని అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి పార్టీ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారుఈ సందర్బంగా పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామా రావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పుంచారు ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డి మాట్లాడు తూ పార్టీ గతంలో ఎన్నో ఒడుదుడుకులను అధికమించి పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసి రాష్ట్రంలో అభివృద్ధి , సంక్షేమం అనే నినాదాలతో పేదలకు అండగా నిలిచిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కిందని ఇప్పటికీ అదే వేగంతో మరో 60 -70 సంవత్సరాలు తెలుగుజాతి గర్వపడేలా ప్రజా శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు. అనంతరం తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి కొంచెం దయాకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు వాడి ఆత్మ గౌరవం అని నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన రోజు నుండి ఎన్నో విప్లవాత్మక చర్యలు చేపట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అలాగే పార్టీని కూడా అదే అంకితభావంతో ముందుకు నడిపారని తదనంతరం తెలుగువారి సత్తా ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదని తెలుగుదేశం పార్టీలో శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలక్కుండా పార్టీ నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణలో ఉంటూ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని రాష్ట్ర ప్రజలందరూ పార్టీకి అండగా నిలిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నందగోపాల్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు బత్తిన ప్రమీల, తుమ్మల మోహన్ నాయుడు, సాగునీటి సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, గంగాధర్ రెడ్డి, భుజిగేంద్ర, కోట శ్రీనివాసులు, కొప్పోలు సురేష్, అన్నమేటి చంద్రయ్య, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.