నల్లజర్ల స్వర్ణసాగరం
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు.ఈ సందర్భంగా దూబచర్ల సెంటర్‌లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే ఎగురవేసి, పార్టీ స్థాపకులు అన్న నందమూరి తారక రామా రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.భారీ సంఖ్యలో తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి దత్త సాయి కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తల సేవలను కొనియాడారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల నుండి ఎంపిక చేసిన 100 మంది సీనియర్ కార్యకర్తలను శాలువ కప్పి, పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు, కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానిక నాయకులు, ప్రజలు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.