చదువుల తల్లి రుణం తీర్చుకొంటున్న టీడీపీ నేత జలీల్ అహ్మద్
ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో అల్లారెడ్డి ఉన్నత పాఠశాల అంతర్జాతీయ స్థాయికి కోట స్వర్ణసాగరం మార్చి 14 పుట్టిన గడ్డ,చదివిన బడిని మర్చిపోకుండా రుణం తీర్చుకునే దిశగా టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ అడుగులు వేస్తున్నారు.కోట మండలం కోటలోని ఏవి కేఆర్ ఉన్నత పాఠశాల ఆవరణంలో శనివారం టిడిపి నేత జలీల్ అహ్మద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.కరుణాకర్ రెడ్డి,ఎంఈఓ దారా మస్తానయ్య లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కోట మండలం మండల కేంద్రంలోని 79 సంవత్సరాల...