swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 2:39 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన సినీ హీరో శ్రీ విష్ణు

కోట స్వర్ణసాగరం మార్చి 1

కోట మండలం నందమూరి ఫ్యాన్స్ మీజూరు మధుబాబు ఎంబేటీ రూపేష్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ను సినీ హీరో శ్రీ విష్ణు నెల్లూరులో ఆదివారం ఆవిష్కరించారు. ఎస్.ఎన్.కే ఫంక్షన్ హాల్ కు సినీ హీరో శ్రీ విష్ణు ఓ సినిమా ప్రమోషన్ కొరకు వచ్చిన సందర్భంగా నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ సుభాష్ గుప్తా తో కలిసి మీజూరు మధుబాబు,రూపేష్ హీరో శ్రీ విష్ణు ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా మీజూరు మధు బాబు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ క్యాలెండర్ ను సినీ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని నందమూరి వంశంలో జన్మించి తాతగారి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని నేడు టాలీవుడ్‌లో తిరుగులేని సూపర్ స్టార్‌గా ఎదిగారన్నారు.తన అద్భుతమైన నటన,డ్యాన్స్ మరియు డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి ఫ్యాన్స్ పాల్గొన్నారు.