స్వర్ణసాగరం డోర్నకల్ మార్చ్ 29 :
తెలంగాణ గంగపుత్ర ఏ సంఘ నిర్మాణం. డోర్నకల్ మండల గంగపుత్ర సంఘం అధ్యక్షులుగా పెద్దపల్లి దిలీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ గంగపుత్ర ఏక సంఘ నిర్మాణం ఆధ్వర్యంలో ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ను మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగిందన్నరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గంగపుత్ర రాష్ట్ర అధ్యక్షులు ఎంపటి సైదులు వల్డ్ వెంకయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోధుమల సంపత్ కుమార్, రాష్ట్ర కోశాధికారి అనుమాస సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి దిలీప్ మాట్లాడుతూ గంగపుత్రుల సామాజిక, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ పథకాలను అందుబాటులోకి తేవడనికి కృషి చేస్తానని తెలిపారు