swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:41 am Digital Edition : DAMA VIJAYAKUMAR

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే నేడు తెలుగువారి నిజమైన పండుగ ఎమ్మెల్యే రోషన్ కుమార్

చింతలపూడి స్వర్ణ సాగరం

తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటే తెలుగు ప్రజలందరికీ నిజమైన పండుగ రోజు అని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు,చింతలపూడి మెయిన్ రోడ్డు తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆదివారం జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. తెలుగు ప్రజలపై ఢిల్లీ పెత్తనానికి స్వస్తి పలికి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి తెలుగుదేశం స్థాపించి 44 సంవత్స రాలుగా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. టిడిపికి పటిష్టమైన క్యాడర్ ఉండడం, మూల స్తంభాలాంటి కార్యకర్తలు పార్టీకి ఉన్న బలమని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు అని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కొనియాడారు. ముందుగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం 1983 నుండి పార్టీలో కొనసాగుతూ పార్టీకి సేవలు అందించిన సీనియర్ కార్యకర్తలను, నాయకులను శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ఘనంగా సన్మానించారు.