swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 10:06 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ– గండవరం సుష్మా రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 29

తెలుగువారి ఆత్మగౌరానికి ప్రతీక
పేదప్రజల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి పేర్కొన్నారు.కోట మండలం తిన్నెలపూడి పంచాయతీ తిన్నెలపూడి గ్రామంలో ఆదివారం గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో,కోట మండలం అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన గండవరం సుష్మా రెడ్డి,టీడీపీ నాయకులు వరాల బాలాజీ ల ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గండవరం సుష్మారెడ్డి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.గ్రామంలో పార్టీ పతాక ఆవిష్కరణ చేసి అనంతరం అందరికి స్వీట్లు పండ్లు పంచారు.ఈ సందర్భంగా గండవరం సుష్మారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ఎన్టీ రామారావు చరిత్ర సృష్టించారని అన్నారు.సినిమా రంగంలో ఎంతో బిజీగా ఉన్నా నందమూరి తారక రామారావు నాటి కాంగ్రెస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు టీడీపీని స్థాపించారని అన్నారు.ఎన్టీఆర్ రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా ఎనలేని కీర్తి సాధించారని,ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు.పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు.ఎన్టీ రామారావు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు పెన్నిదిగా నిలిచారని చెప్పారు.మహిళలకు ఆస్తిలో వాటా,రెండు రూపాయలకు కిలో బియ్యం,వంటి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మర్రి అనిల్,సులూరు విజయ్ కుమార్,వరాల సాంబ శివరావ్,నులక కోటయ్య,హరి,అశోక్, చిరంజీవి,హరి,పోలయ్య కోటయ్య,మధు, వాసు వెంకటయ్య కోటేశ్వరరావు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.