తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ– గండవరం సుష్మా రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 29 తెలుగువారి ఆత్మగౌరానికి ప్రతీకపేదప్రజల పక్షపాతి తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి పేర్కొన్నారు.కోట మండలం తిన్నెలపూడి పంచాయతీ తిన్నెలపూడి గ్రామంలో ఆదివారం గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో,కోట మండలం అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన గండవరం సుష్మా రెడ్డి,టీడీపీ నాయకులు వరాల బాలాజీ ల ఆధ్వర్యంలో 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.గండవరం సుష్మారెడ్డి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.గ్రామంలో పార్టీ పతాక...