swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 2:16 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

నిరుపేద కుటుంబాలకు కొండంత అండ మద్దాలి చారిటబుల్ ట్రస్ట్

రాజేష్ నటరాజన్ కుటుంబానికి మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం

కోట స్వర్ణసాగరం మార్చి 25

నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ నిలుస్తుంది.ఈ నేపథ్యంలో కోట మండలం కోట అరుణ ధియేటర్ ప్రాంతంలో నివాసం ఉండి ఇటీవల మరణించిన రాజేష్ నటరాజన్ కుటుంబానికి బుధవారం మద్దాలి చారిటబుల్ ట్రస్ట్ తరపున 5000 ఆర్ధిక సహాయాన్ని ట్రస్ట్ ప్రతినిధులు అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ 2026 సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుండి మద్దాలి సర్వోత్తమ రెడ్డి ద్వారా తామంతా సభ్యులుగా ట్రస్ట్ ప్రారంభించడం జరిగిందని  ఈ ట్రస్ట్ ద్వారా ప్రస్తుతానికి కోట పంచాయతీ పరిధిలో ఎవరైనా పేద కుటుంబాల్లో వ్యక్తి చనిపోతే   5000 రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తున్నామని తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని  సేవా కార్యక్రమాలను చేపడుతూ సేవా కార్యక్రమాలు చేపట్టే పరిధిని విస్తరిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు తీగల సురేష్ బాబు,తూపిలి రాధాక్రిష్ణారెడ్డి,మర్రి అనీల్,  బండారు క్రిష్ణయ్య,చల్లా కేదార్నాధ్ శ్రీకాంత్, తిరువీధుల నాగార్జున తదితరులు పాల్గొన్నారు.