కోట స్వర్ణసాగరం మార్చి 23
కోట మండలం నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాయకులు,
జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు.సోమవారం నూతన డ్రైనేజీ కాలువల నిర్మాణానికి నెల్లూరు మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ నిర్వహించి డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామంలో గడిచిన 18 నెలల్లోనే 80 లక్షల రూపాయలు నిధులతో డ్రైనేజీ కాలువల నిర్మాణాలు,సిమెంటు రోడ్లు, త్రాగునీటి సమస్యను నివారించేందుకు ఏడు త్రాగునీటి చేతి పంపు బోర్లు,గ్రావెల్ రోడ్లు వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేశామని అన్నారు.శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మెయిన్ రోడ్ నందు ఈరోజు డ్రైనేజీ కాలువల నిర్మాణానికి గ్రామస్తుల సమక్షంలో భూమి పూజ చేయడం ఆనందంగా ఉందన్నారు.ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధితో ముందుకు తీసుకు వెళ్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలో నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామ ప్రజలు నెల్లూరు మోహన్ రెడ్డి గ్రామ అభివృద్ధికి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నేదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి,కట్ట శంకర్ రెడ్డి, మురళి రెడ్డి,ఎంపీటీసీ నారాయణ, నారాయణరావు,నఫీ,పెనుబోలు ప్రభాకర్ రెడ్డి,రమేష్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు తదితరులున్నారు.