swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 1:44 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

పంట్రంగం వసంత్ కు ఆల్ ది బెస్ట్ తెలిపిన బహుజన యూత్ ఫోర్స్ నాయకులు

*కోట స్వర్ణసాగరం మార్చి 19*

కోట మండలం కోటలోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలో గురువారం నూతనంగా ప్రారంభించబడిన వసంత్స్ క్వాలిటీ కేఫ్ ప్రారంభోత్సవంలో కోట బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పాల్గొన్నారు.ఈ నేపద్యంలో బహుజన యూత్ ఫోర్స్ నాయకులు వసంత్స్ క్వాలిటి కేఫ్ అధినేత వసంత్ దంపతులకు శాలువా పూలమాలతో సత్కరించి ఆల్ ది బెస్ట్ తెలిపారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ మంచి సహాయ గుణం కలిగి నూతనంగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన వసంత్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఇంకా అనేక రకాల వ్యాపారాలతో మంచి ఉన్నత స్థాయికి చేరుకొని పదిమందికి సహాయం చేస్తూ ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పాల్గొన్నారు.