కోట స్వర్ణసాగరం మార్చి 19
తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఉగాది ప్రజల జీవితాల్లో సంతోషం ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తాయని, కొత్త సంవత్సరం అందరికీ మంచి చేయాలని కోరుకున్నారు.ఉగాది శాస్త్రీయతను, సాంప్రదాయ ప్రాముఖ్యతను ప్రజలందరు గుర్తు చేసుకోవాలని అన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకుల జీవితాల్లో ఈ పరాభవ నామ సంవత్సరం సరికొత్త ఆశలను,విజయాలను నింపాలని ఆకాంక్షించారు.కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని,సమృద్ధిగా వానలు కురిసి,రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు.