swarnasagaram.com
Date of Publish : 09 March 2026, 5:41 am Posted by : Pakam chennakesavulu Kota Mandal

ప్రజలకు ఉపయోగపడని డ్రైనేజీ కాలవలు నిర్మాణం ఎవరి స్వలాభం కోసం

నిర్మించారే గాని వాడుకలోకి రాని డ్రైనేజీ కాలువలు

నాసిరకం డ్రైనేజీ కాలువల నిర్మాణంతో లక్షల రూపాయలు కాంట్రాక్టర్ల పాలు

కేవలం కాంట్రాక్టర్ల స్వలాభాల కోసమే గత ప్రభుత్వంలో డ్రైనేజీ కాలువల నిర్మాణాలు

కొత్త డ్రైనేజీ కాలవలను నిర్మించి మాకు డ్రైనేజీ సమస్యలను తీర్చండి..కోట దళిత వాడ ప్రజలు

కోట స్వర్ణసాగరం మార్చి 9

కోట మండలం దళితవాడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన వీధులలో గత వైసీపీ ప్రభుత్వ పాలనలో డ్రైనేజీ కాలువలను కేవలం కాంట్రాక్టర్ల స్వలాభాల కోసమే నిర్మించారని కోట దళితవాడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ప్రభుత్వం లో నిర్మించిన ఈ డ్రైనేజీ కాలవలు ఎవరికి ఉపయోగపడటం లేదని మా ఇళ్లలోని మురికి నీరు ఎలా బయటకు పోతుందని వారు తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.డ్రైనేజీ కాలవలను నిర్మించే సమయంలో కాంట్రాక్టర్లకు మీరు నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువలు ప్రజలకు ఉపయోగకరంగా నిర్మించమని మొరపెట్టుకున్న మా మాట లెక్కచేయకుండా నాసిరకంగా డ్రైనేజీ కాలువలను నిర్మించారని వారు వాపోయారు.ప్రస్తుతం కోట పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించి నూతన డ్రైనేజీ కాలువలను నిర్మించాలని వారు కోరుతున్నారు.