బహుజన యువత మేలుకో బానిసత్వాన్ని వీడి బహుజన సమాజాన్ని నిర్మించు…శ్రీరాం శివప్రసాద్
కోట స్వర్ణసాగరం మార్చి 15 బహుజన యువత మేలుకొని బానిసత్వాన్ని పూర్తిగా వీడి బహుజన సమాజాన్ని నిర్మించుకునేందుకు యువత అందరూ కృషి చేయాలని అంబేద్కర్ యూత్ సేవా సమితి అధ్యక్షులు ఫౌండర్ శ్రీరాం శివప్రసాద్ పేర్కొన్నారు.ఆదివారం కోట అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన మాన్యశ్రీ కాన్సిరాం జయంతి వేడుకలలో శివ శంకర్ బహుజన యువతకు మంచి సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో శివ ప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకు ఇచ్చిన హక్కులను ఆయుధాలుగా చేసుకుని బహుజన సమాజ స్థాపన కోసం యువత ముందుకు సాగాలని...