– వవ్వేరు బ్యాంకు సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన
– టీడీపీ 44 వ ఆవిర్భావ వేడుకలలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు, స్వర్ణ సాగరం, మార్చి 29:
తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రస్థానానికి 44 ఏళ్లు పూర్తయ్యాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. బుచ్చిరెడ్డి పాళెం పట్టణంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ఆదివారం జరిగాయి.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలోని వవ్వేరు సహకార బ్యాంకు సమీపంలో ఆమె తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి శంఖుస్థాపన చేశారు. అనంతరం స్థానిక కెవిఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఆమె టిడిపి ఆవిర్భావం నుంచి కష్ట పడ్డ సీనియర్ కార్యకర్తలకు సన్మానం చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కార్యకర్తలకు మెమెంటోల ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ మార్చి 29 1982 తెలుగు జాతి చరిత్రను మలుపు తిప్పిన రోజుగా అభివర్ణించారు. సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్ళు’ అనే నినాదంతో ఎన్టీఆర్ గారు సృష్టించిన ఆరు అక్షరాల ప్రభంజనం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందనన్నారు. పేదల కోసం 2 కిలో బియ్యం, పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారకరామారావు గారిదేనన్నారు. నాడు ఎన్టీఆర్ పునాది వేస్తే టిడిపికి వ్యవస్థాగత రూపం ఇచ్చి 30 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కుతుందన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఐటి నిపుణులుగా తెలుగు వారు వున్నారంటే చంద్రబాబు నాయుడు విజన్ వల్లే సాధ్యమైందన్నారు. పార్టీని నెక్స్ట్ జనరేషన్‌కు అనుసంధానం చేయడంలో యువనేత నారా లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశంసించారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడం మాత్రమే కాదని ప్రజలకు మేలు చేయాలన్న తాత, తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అని లోకేష్ నిరూపించారన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా యువనేత లోకేష్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారని ప్రశంసించారు. ఈ కార్యక్రమం లో బుచ్చి చైర్పర్సన్ మోర్ల సుప్రజ, సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, చేనేత చేనేత ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కె.వి శేషయ్య, మోర్ల మురళి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు , జిల్లా నాయకులు ఎం వి శేషయ్య, క్లస్టర్ ఇంచార్జ్ వింజం రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా పసుపు జెండాను గుండెలకు హత్తుకున్న ప్రతి కార్యకర్త సేవలను పార్టీ గుర్తిస్తుందని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా నేరుగా తననుసంప్రదించాలని కోరారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరినీ అండగా ఉండి ఆదుకుంటానాని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కార్యకర్తలకు భరోసా యిచ్చారు. టిడిపి స్థానికంగా ఎన్ని గ్రూపులున్నా పార్టీ సత్తా చాటి చెప్పే సమయం ఆసన్నమైతే తామంతా ఒకే కుటుంబం అన్న ఐకమత్యం తెలుగుదేశం కార్యకర్తలలో గత ఎన్నికల సందర్భంగా చూశానన్నారు. కార్యకర్తల సమిష్టి కృషి ఫలితంగానే తానూ 54 వేల మెజారిటీతో విజయం సాధించగలిగానన్నారు. తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు లాంటి కోవూరు నియోజకవర్గంలో టిడిపి వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ విగ్రహం లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డి పాళెం, కోవూరు పట్టణాలలో త్వరలోనే విగ్రహ నిర్మాణాలు పూర్తి చేసి టిడిపి అధినేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గార్లతో ప్రారంభోత్సవం చేయిస్తామన్నారు. నాయకులు కార్యకర్తలు పార్టీ పట్ల నిబద్ధతకు సంబంధించి నాయకులు మరియు కార్యకర్తలతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో బుద్ధి చైర్పర్సన్ మోర్ల సుప్రజ, సీనియర్ నాయకుల కోడూరు కమలాకర్ రెడ్డి, చేనేత ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కెవి శేషయ్య, సీనియర్ నాయకులు మోర్ల మురళి,ఎంవి శేషయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు, క్లస్టర్ ఇంచార్జ్ వింజం రామానాయుడు, దుగ్గిశెట్టి హరినాద్, వల్లూరు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు