swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 2:39 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

మానవత్వం చాటుకున్న రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనుపూరు జగదీష్

కోట స్వర్ణసాగరం మార్చి 24

చిట్టమూరు మండలం యాకసిరి గ్రామంలో ఇటీవల గుండెపోటుతో తో నిరుపేద రజక కులానికి చెందిన నంద్యాల సుమంత్ అనే 21 సంవత్సరాల యువకుడు  మృతి చెందాడు.ఆ విషయం తెలుసుకున్న నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనుపూరు జగదీష్ సుమంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దని ధైర్యాన్ని ఇచ్చాడు.ఈ నేపథ్యంలో మంగళవారం కుటుంబ సభ్యులకు రజక సంఘం సభ్యులు అందరి సహకారంతో 6000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు.ఆపద సమయంలో సహాయం అందించి ఆదుకున్న నవ్యాంధ్రప్రదేశ్ రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనుపూరు జగదీష్ కు,సభ్యులకు సుమంత్ తల్లిదండ్రులు నంద్యాల శ్రీనివాసులు,అరుణ కృతజ్ఞతలు తెలిపారు.చిన్న వయసులో సంస్థను స్థాపించి అనేకమంది నిరుపేదలకు అండగా నిలుస్తున్న కనుపూరు జగదీష్ సేవలను పలువురు అభినందిస్తున్నారు.అనంతరం నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ వారి కుటుంబానికి అన్ని విధాలుగా నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుజాత దేవి,వెల్ఫేర్ అసిస్టెంట్ భాను ముఖ్య అతిథిగా పాల్గొని వారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు.