మానవత్వానికి నిదర్శనం టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్
కోట స్వర్ణసాగరం మార్చి 14 మానవత్వానికి నిదర్శనంగా టీడీపీ నేత జలీల్ అహ్మద్ నిలిచారు.కోట మండలం కోటలోని ఏవికేఆర్ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఆవుల దేశమ్మ వారం రోజుల క్రితం పాఠశాలలో ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోవడంతో పాఠశాల యాజమాన్యం ఆ బాలికను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.అయితే ఆమె ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మెరుగైన వైద్యం కోసం బాలికను చెన్నైకి తరలించారు. ఆ బాలిక నిరుపేద కుటుంబానికి చెందడంతో వారి తల్లిదండ్రులకు మెరుగైన వైద్యం చేయించేందుకు స్తోమత లేదని తెలుసుకున్న...