కోట స్వర్ణసాగరం మార్చి 21
గూడూరు నియోజకవర్గం ముస్లిం సోదర సోదరీమణులకు టీడీపీ కోట మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా కోట మండల ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు 30 రోజులు కఠిన ఉపవాసాలు ఉండి ప్రపంచ శాంతిని కోరుకునే మంచి మనసు ఉన్న ముస్లిం సోదరులకి వారి కుటుంబాలకు “అల్లా”చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను.అలాగే మా నాయకుడు జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ కి రంజాన్ శుభాకాంక్షలు.పేదవారు సంతోషం గా ఉండాలనే జలీల్ అహ్మద్ 600 కుటుంబాలకు రంజాన్ తోఫా గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ చేతుల మీద ఇవ్వడం జరిగిందని ఆయన ఇలాని గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆ శక్తిని అల్లా జలీల్ అహ్మద్ కు ఇవ్వాలని,జలీల్ అహ్మద్ మహ్మద్ ప్రవక్త బాటలో నడుస్తూ,సమాజంలో పేదల ఆకలి బాధలు తెలుసుకుని,దాన ధర్మాలు చేస్తూ దయాగుణం,సేవ,శాంతితో ముందుకు వెళ్లడం గొప్ప విషయమని అన్నారు.అల్లా దయతో జలీల్ అహ్మద్ ఎన్నో ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నాన్నని తెలిపారు.ఈద్‌ను ముస్లింలు అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.