ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్
కోట స్వర్ణసాగరం మార్చి 21 ముస్లిం సోదర సోదరీమణులకు,జిల్లా ప్రజలందరికి టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అందరు ప్రశాంత వాతావరణంలో ఈ పండుగను జరుపుకోవాలని సూచించారు. ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖసంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు.పవిత్ర రంజాన్ మాసం మానవత్వం,సహనం,దానధర్మాల ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.అల్లా కృపతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొనాలని,ప్రజలు ఆరోగ్యంగా,ఆనందంగా ఉండాలని,ప్రజలు ఐక్యంగా,సౌభ్రాతృత్వంతో జీవించాలని ఆకాంక్షించారు.క్రమశిక్షణ,దాతృత్వం,ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత అని అన్నారు.పవిత్ర దివ్య ఖురాన్...