కోట స్వర్ణసాగరం మార్చి 26
కోట మండలం కోటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్త డిసిఓ పద్మజా గురువారం కోటలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంను ఆకస్మిక తనిఖీ చేశారు.వంటశాలను తనకి చేసి రోజువారి మెనూని పరిశీలించారు.వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.విద్యార్థులకు ప్రభుత్వం అందించినటువంటి మౌలిక వసతులు మరియు విద్యను అందించే విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఉత్తమ ఫలితాలు సాధన గురుకులాల లక్ష్యం అని ఆమె మీడియాతో తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట ప్రిన్సిపాల్ ఎ. వెంకటేశ్వర్లు మరియు బోధన బోధనేతర సిబ్బంది ఉన్నారు.