swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 30 March 2026, 8:06 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

వెంకన్నపాళెం గ్రామంలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

కోట స్వర్ణసాగరం మార్చి 29

కోట మండలం వెంకన్నపాలెం గ్రామంలో గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ గ్రామఅధ్యక్షడు ఉలసా శీనయ్య,మధు యాదవ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.నందమూరి తారక రామారావు చిత్రపటానికి కి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గ్రామంలో పార్టీ పథకాన్ని ఆవిష్కరణ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు.ఈ సందర్భంగా మధు యాదవ్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారులకు వచ్చి చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్న ఎన్టీ రామారావు సినిమాల్లో బిజీగా ఉన్నాను నాటి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు టిడిపిని స్థాపించారని,ఎన్టీఆర్ రాజకీయాల్లోనే కాకుండా సినీ ప్రస్థానంలో కూడా ఎనలేని కీర్తి సాధించారని తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేదవాడికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలకు ఆస్తిలో వాటా,రెండు రూపాయలకే కిలో బియ్యం,రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు నాంది పలికిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ,కార్యకర్తకు భరోసా ఇస్తూ ఈ రోజున దేశ రాజకీయాల్ని శాసించే స్థాయిలో ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మధు యాదవ్,ఉలస శీనయ్య,డేగ మునిస్వామి, లింగం గుంట హరిప్రసాద్,లింగం గుంట కార్తీక్,గుర్రం రాము,లింగం గుంట శ్యామ్,మోపూరు కిష్టయ్య,యనమల శ్రీనివాసులు,ఆవుల జనార్ధన్,కోకర్ల సుధాకర్, ఏడుకొండలు,పెనుబోతు వేణు,కుమారి రమణ గౌడ్,పిట్ల అనిల్ మల్లి శరత్ తనిగల సురేంద్ర,తనిగల సుధాకర్,తనిగల ధనంజయ కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.