swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 6:08 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

వేముల పోలయ్య కుటుంబానికి అండగా టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 1

కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన వేముల పోలయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మరణించారు.ఈ నేపద్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి వేముల పోలయ్య భౌతికకాయానికి పూలమాల వేసి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పోలయ్య అంత్యక్రియల నిమిత్తం 5000 రూపాయలు ఆర్థిక సహాయమును వారి కుటుంబానికి అందించి వేముల పోలయ్య కుటుంబానికి అండగా నిలిచి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని మీకు ఎటువంటి సమస్య వచ్చిన నేను అండగా ఉంటానని వారికి మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా పోలయ్య కుటుంబ సభ్యులు ఆపద సమయంలో ఆపద్బాంధవుడిల ఆదుకున్న నెల్లూరు మోహన్ రెడ్డికి కన్నీటితో కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు మోహన్ రెడ్డి వెంట కట్టా శ్రీ శంకర్ రెడ్డి,మాజీ పెన్నక్క చెరువు ప్రెసిడెంట్ నేదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి,అల్లు జనార్దన్ రెడ్డి,ఎంపీటీసీ నారాయణ బూత్ కన్వీనర్ గుండాల సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.