swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 2:09 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

శ్రీరామనవమి వేడుకలలో ముఖ్యఅతిథిగా నలపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 27

కోట మండలం కోటలోని శ్యామసుందరపురం కాలనీలో మరియు కోటలోని విష్ణు దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలలో భాగంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వినోద్ కుమార్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం ఆలయ అర్చకులు సీతారాముల వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డికి హారతి,తీర్థప్రసాదాలు అందించారు.ఈ సందర్భంగా నల్లపురెడ్డి వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోట పంచాయతీ పరిధిలో ఎక్కడ ఏ దైవ కార్యము,శుభకార్యములు నిర్వహించిన ఎంతో ప్రేమాభిమానాలతో తమను ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తూ వారు చూపిస్తున్న అభిమానానికి వెలకట్టలేమని వినోద్ కుమార్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో హనుమంతు రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి,నందం మోహన్,మధు, సురేష్,బాలాజీ,చరణ్ గ్రామస్తులు భక్తులు ఉన్నారు.