swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:46 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి భక్తులకు అంబలి,మజ్జిగ పంపిణీ చేసిన కోట పట్టణ యువత

కోట స్వర్ణసాగరం మార్చి 11

కోట మండలం కోట దాదరాయిగుంట సెంటర్ వద్ద కోట పట్టణ యువత ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ కనుపూరు ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా జాతరకు వెళ్ళు వందలాదిమంది భక్తులకు అంబలి మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కోట పట్టణ యువత మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఇతర రాష్ట్రాల నుండి,జిల్లాల నుండి వేరువేరు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తులకు తమ వంతుగా మజ్జిగ, అంబలి ఉచితంగా అందించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.ప్రతి ఒక్కరికి కష్టసుఖాలు అనేవి సహజమని మనకు ఉన్నంతలో కొంత పేదలకు సహాయం చేయడంలో ఉన్న ఆనందం ఎందులోనూ లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో యం.హరి ప్రసాద్ రెడ్డి,అఖిల భారత హిందూ మహాసభ గూడూరు నియోజకవర్గ అధ్యక్షులు ఎ.దయాకర్,ఉపాధ్యక్షుడు కె.మురళీధర కుమార్,ఓ.రాజశేఖర్ జె.నరేష్ రెడ్డి, పి.నవీన్,పి.రంజిత్,ఉక్కు కిషోర్, శ్రీనివాసులు,కె.దయాకర్ ఎన్.రవి కుమార్, హేమంత్,మహి,తదితరులు యువత పాల్గొన్నారు.