swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 1:25 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం మార్చి 10

కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామానికి చెందిన తూపిలి సుధాకర్ కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు చేసిన 21 వేల రూపాయలు చెక్కును బాధితుని తల్లి తూపిలి శారదమ్మకు గూడూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సమక్షంలో టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారికి చెక్కును అందజేశారు.ఈసందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ నమ్ముకున్న వారికి తెలుగుదేశం పార్టీ ఎలప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన స్వర్గీయ తూపిలి సుధాకర్ తల్లి శారదమ్మ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చుతో కూడిన చికిత్స చేయించుకోవడం కోసం ఎమ్మెల్యే సునీల్ కుమార్ ని సహాయం కోసం అడిగిన వెంటనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా తమకు ఆర్థిక సహాయం అందజేశారని,వారు చేసిన సహాయం ఏప్పటికీ మర్చిపోమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కి,సీఎం రిలీఫ్ ఫండ్ కోసం మాకు ఎంతగానో సహాయం చేసిన నెల్లూరు మోహన్ రెడ్డికి ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,మండల అధ్యక్షులు పలగాని భాస్కర్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల,ఎంపీటీసీ షేక్ శంషుద్దీన్,తదితరులు ఉన్నారు.