swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 04 March 2026, 1:16 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

స్పందించిన టీడీపీ నేత జలీల్ అహ్మద్…హ్యాండ్ బోర్ కు మరమ్మత్తులు

కోట స్వర్ణసాగరం మార్చి 4

కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో ఉన్న మండల ప్రజా పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలపై మంగళవారం స్వర్ణసాగరం దినపత్రికలో వచ్చిన పేరుకే ఆదర్శ పాఠశాల కనీస వసతులకు కరువు అనే వార్తకు టీడీపీ నాయకులు జిల్లా పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ స్పందించారు.ఈనేపథ్యంలో టీడీపీ నేత జలీల్ అహ్మద్,ఎంపీటీసీ శంషుద్దీన్ పాఠశాల ఆవరణంలో హ్యాండ్ బోర్ ను మరమ్మత్తులు చేయాలని సమస్యను ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ కు,ఆర్డబ్ల్యూఎస్ ఏ.ఈ అరవింద్ కు తెలియజేసారు.వెంటనే ఎంపీడీఓ దిలీప్ కుమార్ నాయక్ ఆదేశాలతో బోర్ మెకానిక్ రవి తమ సిబ్బందితో హ్యాండ్ బోర్ కు మరమ్మత్తులు చేసి వాడుకలోకి తెచ్చారు.ఈనేపథ్యంలో కాలనీ ప్రజలు జలీల్ అహ్మద్ కు,శంషుద్దీన్ కు,అధికారులు దిలీప్ కుమార్ నాయక్ కు,అరవింద్ కు ధన్యవాదములు తెలిపారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ గూడూరు శ్యాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో పాఠశాలలో ఉన్న పలు సమస్యలను త్వరలో పూర్తి చేస్తానని తెలిపారు.ప్రజలకు ఎప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చిన వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రజల శ్రేయస్సు కొరకు ఎలాంటి అవరోదాలు ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టంగా చెప్పారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ రమణయ్య సిబ్బంది ఉన్నారు.