ఏఐటీయూసీ అధ్యక్షులు సయ్యద్ యాసిన్…
కనిగిరి స్వర్ణ సాగరం మార్చి 29
కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్య పోరాటాలే శరణమని ,అందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఏఐటియుసి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు సయ్యద్ యాసిన్ పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ కనిగిరి నియోజకవర్గ ఐదవ మహాసభల సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత ఏఐటియుసి జెండానుసీనియర్ నాయకులు గుజ్జుల బాల్రెడ్డి ఆవిష్కరించారు.స్థానిక ఎన్జీవో హోంలో జరిగిన మహాసభలకు పాలపర్తి మస్తాన్రావు, షేక్ . ఖాదర్ వలి అధ్యక్ష వర్గం గా వ్యవహరించారు.సభకు ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ ఉమ్మడి ప్రకాశం జిల్లా. అధ్యక్షులు సయ్యద్ యాసిన్ మాట్లాడుతు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వందేళ్ళ చరిత్ర కలిగిన ఏఐటియుసి కార్మికులకు అండగా పనిచేస్తుందని కార్మికులు తమ హక్కుల పరిరక్షణ కోసం సాధించుకున్న చట్టాలను అలాగే స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ కార్మికుల ఐక్యతకు యూనియన్లకు విఘాతం కలిగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ఆయన దయ పట్టారు. కార్మికులకువ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, వెట్టి చాకిరి విధానాన్ని రద్దు చేయాలని ఆయన కొని ఆడారు. కార్మికుల హక్కుల కోసం కలిసికట్టుగా కార్మిక అనుబంధ సంఘాలు కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడే మన హక్కులను సాధించుకోగలమని తెలిపారు. అందుకోసమే ఏప్రిల్ 8వ తేదీన కనిగిరిలో ఏఐటియుసి జిల్లా మహాసభలను ఏర్పాటు సందర్భంగా కనిగిరి ఏఐటీయూసీ అనుబంధంగా ఉన్న సంఘాలన్నీ పాల్గొని ఆ సభ లను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇలాంటి సభలలో పాల్గొని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కార్మికుల ఐక్యతను చాటుతున్నదని, ఐక్యతగా ఉన్నప్పుడే ఏదైనా సాధించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు.ఈ మహాసభలలో జిల్లాసిపిఐ పార్టీ కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు,మండల సిపిఐ కార్యదర్శి రామారావు, రైతు సంఘం నాయకులు గుజ్జుల బాలిరెడ్డి, డి. హెచ్.పి.ఎస్.జిల్లా కార్యదర్శి పందిటి మోహన్, ఏఐటీయూసీ నాయకులు గులాo,హుస్సేన్ ,ఖాసింపీరా,మునిసిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి నాయకులు నాసర్, గంగవరపు కిరణ్, అంగన్వాడి నాయకులు దీపిక, కుమారి, జులేఖ, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు.