swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 12:57 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

అంటరానితనం మీద అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నతమూర్తి అంబేద్కర్-జలీల్ అహ్మద్

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 14

అంటరానితనం మీద అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నతమూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ అన్నారు.కోట మండలం కోటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గజ పూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి భారత రాజ్యాంగాన్ని రచించి దేశానికి రాజ్యాంగ ఫలాలు అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్మరించుకోవడం ఆనందంగా ఉందన్నారు.అంటరాని తనం,కులవివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి అస్తిత్వ ఉద్యమాలకు దశ దిశను చూపిన స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని అలాంటి మహనీయుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.అక్షరమే ఆయుధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన విద్యా కుసుమం అసమానతలు,అంటరానితనం నిర్మూలనకై అహర్నిశలు పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త విభిన్న సంస్కృతుల భారత దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు విశేష కృషి చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రధాత అని అన్నారు.అలాంటి మహనీయుని జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్,నెల్లూరు మోహన్ రెడ్డి,మధు యాదవ్,తిరుమల శెట్టి కోటేశ్వరరావు,షేక్ శంశుద్దీన్,దారా సురేష్,నౌషాద్, మర్రి ప్రమీల,పోలమ్మ,మధు బాబు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.