కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 14
కోట మండలం కోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా కోట బజారు సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు అనుబంధ విభాగాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి పాముల సురేంద్ర మాట్లాడుతూ ప్రపంచ మేధావి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శం అన్నారు.ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేద్దామన్నారు.అంబేద్కర్ మహిళలు, కార్మికులు,కర్షకులు,ఉద్యోగస్తులు విద్యార్థుల కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు.అంబేద్కర్ స్ఫూర్తితో పార్టీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం అమలు చేశారన్నారు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా 50% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. అనంతరం పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మ మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ తన చిన్నతనంలోనే కడు పేదరికం అనుభవించి ఆయన ప్రపంచ మేధావిగా సాధించిన ఘనతను వివరించారు,అనంతరం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు మద్దూరి స్వరూప్ మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, రాజకీయ నాయకులు మారారు కానీ విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిర్మించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని అలాగే చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కల్పించారని చెప్పారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, రాజారామిరెడ్డి,శశి రెడ్డి,కోట మండల మహిళా అధ్యక్షురాలు రేష్మ,జిల్లా మహిళా కార్యదర్శి సుధా రెడ్డికోట పట్టణ మహిళా అధ్యక్షురాలు పనబాక శిరీష, కర్లపూడి బుజ్జయ్య,కోట మండల ప్రధాన కార్యదర్శి పాములు సురేంద్ర, కోట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మద్దూరు స్వరూప్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ మొయిన్ భాష,రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ కనుపూరు జగదీష్,కోట మండల సోషల్ మీడియా కన్వీనర్ ఆములూరి నాగార్జున,ముని కుమార్,మండల యువత ఉపాధ్యక్షుడు గంప కోటేశ్వరరావు,మండల మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ సాదిక్ భాష,ఎస్సీ సెల్ కార్యదర్శి ఎర్రమతి సాయికుమార్, యువత కార్యదర్శి వాకాటి అనిల్,మైనార్టీ నాయకులు అంజాద్ భాష,సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి మున్నా,మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ ఖలీల్,మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.