swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 2:15 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

అంబేద్కర్ ఎస్సీలకే కాదు అణగారిన వర్గాలకు మహానాయకుడే-జలీల్ అహ్మద్

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 14

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎస్సీ వర్గానికే కాదు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ అణగారిన వర్గాల ప్రజలకూ మహా నాయకుడేనని అన్నారు.కోట మండలం కోటలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి మండల పార్టీ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలలో టీడీపీ నేత జలీల్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ అనగానే వర్గాల ప్రజలు ఈరోజు రాజకీయాలలో అన్ని ఉన్నత పదవులను అనుభవిస్తున్నారన్న,రాజకీయంగా,ఆర్థికంగా, సామాజికంగా,రిజర్వేషన్ ను వాడుకొని ఎదుగుతున్నారు అంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం వలనే అందరికీ అన్ని హక్కులు వచ్చాయన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలను మనమందరం అనుభవిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా చేసుకొని ముందుకు సాగడంలో ఆయనకు మనం అర్పించే గొప్ప నివాళులు ఉన్నాయని అన్నారు.