కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 17
గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన నేపథ్యంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కోట మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి,చిట్టేడు పిఎసిఎస్ డైరెక్టర్ చంద్రగిరి మధు శుక్రవారం గూడూరులోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి గజ పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా చంద్రగిరి మధు మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజలకు చేసిన మంచి గ్రామాలలో చేసిన అభివృద్ధి ఆయన మంచి నడవడిక ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉన్నత శిఖరాలకు చేర్చిందని ఎమ్మెల్యే సేవలను కొనియాడారు.భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్నో పదవులను అధిరోహించాలని,రానున్న రోజుల్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యే నుండి మంత్రి పదవిని ఖచ్చితంగా పొందుతారని ఎమ్మెల్యే పై మధు కు అభిమానాన్ని తన మాటలతో చాటుకున్నారు.