కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 20
కోట మండలం కోటలోని ఎ.వి.కే.ఆర్ ఉన్నత పాఠశాలలో జరిగిన విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76 వ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిధులుగా విచ్చేసిన నెల్లూరు జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ బీద రవిచంద్ర,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ లను గూడలి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి గజ పూలమాలతో ఘనంగా సత్కరించి పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికి ఎమ్మెల్యే మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.ఈసందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు కోట మండలంపై ప్రత్యేక అభిమానం ఉందని,ఆ అభిమానాన్ని గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేస్తూ ప్రజా అభివృద్ధిపై చూపిస్తున్నారని కొనియాడారు.గూడలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సునీల్ కుమార్ సహకారంతో అనేక అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.సునీల్ కుమార్ నాయకత్వంలో పని చేయండి తాను ఒక వరంలా భావిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో గూడలి గ్రామ టీడీపీ నాయకులు,యువత,కార్యకర్తలు పాల్గొన్నారు.