తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి గా కుంచం దయాకర్
హార్దిక శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత అధికార ప్రకతినిధి -కడిమి వెంకటేష్
వాకాడు స్వర్ణసాగరం ఏప్రిల్ 27
తెలుగుదేశం పార్టీ ప్రముఖుల సమక్షంలో తిరుపతి పార్లమెంట్ అధికారి ప్రతినిదిగా ప్రమాణస్వకారం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుంచం దయాకర్ ని వాకాడు మండల తెలుగు యువత అధికార ప్రతినిధి కడిమి వెంకటేష్ శాలువా, పుష్పగుచ్ఛం తొ సన్మానించారు.ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తకు అన్యాయం జరగదని దానికి నిదర్శనమే ఈ పదవని తీర ప్రాంతం తిరుమూరు గ్రామంలో పుట్టి ఒక సామాన్య కార్యకర్తనుండి సుదీర్ఘ కాలం క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఎదిగిన పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన అయన శ్రమను గుర్తించి పార్టీ అధిష్టానం ఇంతటి పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో పార్టీకి, ప్రజలకు మరిన్ని సేవలు చేసి అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుడిని కోరుతున్నట్లు తెలిపారు.