కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 20
కోట మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకన్నపాలెం గ్రామ సర్పంచ్ కోకర్ల మధు యాదవ్ కు తెలుగుదేశం పార్టీ కోట మండలం ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు,సోషల్ మీడియా అధ్యక్షులు మీజూరు మధుబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తిరుమల శెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ మంచి సేవా గుణం కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకొని,పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలోనే కాకుండా నియోజకవర్గం స్థాయిలో కూడా తన వంతు సహాయ సహకారాల అందిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ పలు సేవా కార్యక్రమాలతో యువతకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతున్న మంచి మనసున్న వ్యక్తి కోకర్ల మధు యాదవ్ అని అన్నారు.మధు యాదవ్ కు ఆ భగవంతుడు ప్రతి పని యందు విజయాన్ని అందించాలని, ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.