swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 10:05 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

కోటలో బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 14

కోట మండలం కోటలో బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.బహుజన సమాజ్ పార్టీ, బహుజన యూత్ ఫోర్స్,మాల మహానాడు, సమాజ చైతన్య సమితి నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జై భీమ్ జోహార్లు నినాదాలు తీశారు.అనంతరం భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కొత్తూరు,కల్లూరు,మల్లాం గ్రామాలలోని ప్రజల ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆ గ్రామాలలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలలో బహుజన యూత్ ఫోర్స్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుబడటంతో పాటు అందరి సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన త్యాగధనుడు డా.బి.ఆర్.అంబేద్కర్ అని,సమాజానికి సమానత్వాన్ని ప్రసాధించిన గొప్పవ్యక్తి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను వందలాదిమంది బహుజన మధ్య జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించాడని కొనియాడారు.సమాజంలో అంటరానితనాన్ని అస్పృశ్యతను రూపుమాపేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాట ఆదర్శనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సమాజ చైతన్య సమితి నాయకులు డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు,వసంత్, తిరుమూరు కృష్ణయ్య, ప్రతాప్,ప్రసన్న,బీఎస్పీ  నాయకులు సుధాకర్,ఐవీ రమణయ్య, మురళి యాదవ్, మీజూరు సుబ్రమణ్యం, దాసరి సుందరం,మాల మహానాడు మల్లికార్జునరావు,బి.వై.ఎఫ్ నాయకులు శ్రీరామ్ శివప్రసాద్, దాసరి అశోక్ కాంబ్లె,బి.వై.ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.