swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 9:29 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

చంద్రబాబు నాయుడు కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ విశ్వ విధేయుడు షేక్ జలీల్ అహ్మద్

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 20

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడుకు జిల్లా మైనారిటీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ విశ్వ విధేయుడు షేక్ జలీల్ అహ్మద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబునాయుడు అని అన్నారు.ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న పాలన దేశానికే ఆదర్శమని అలాంటి గొప్ప నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఆయన ఆధ్వర్యంలో పార్టీ కోసం పనిచేయడం గర్వంగా ఉందన్నారు.ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు కలిగించాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.