swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 8:20 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

పేద ఇండ్లలో పండుగలా తెల్లవారుజామున పెన్షన్ల పంపిణీ…పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 1

కూటమి ప్రభుత్వ పాలనలో తెల్లవారి జామునే అర్హులకు పెన్షన్లు పంపిణీ చేయడం పేదవారి ఇండ్లలో పండుగ వాతావరణం తలపిస్తుందని టీడీపీనేత పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.బుధవారం కోట మండలం గూడలి గ్రామంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సచివాల సిబ్బందితోపాటు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ  కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు.ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటికే కోట మండల పరిధిలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, రానున్న ఎన్నికలలోపు గూడూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధికి మొదటి స్థానంలో నిలిచేలా ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభివృద్ధి చేస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది ఉన్నారు.