swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 9:02 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నిబంధనలను పాటించాలి- ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 16

కోట మండలం విద్యానగర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ నందు కోట ఫైర్ ఆఫీసర్ కే.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఫైర్ వారోత్సవాల్లో భాగంగా గురువారం అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అపార్ట్మెంట్స్ లో నివసించే ప్రజలకు ఇండ్లలో గ్యాస్ ప్రమాదాలు జరిగితే వాటిని నివారించే పద్ధతులు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈసందర్భంగా ఫైర్ ఆఫీసర్ కే.శ్రీనివాసులు మాట్లాడుతూ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున,ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నిబంధనలను పాటించాలని తెలిపారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఆఫీసుకు సమాచారాన్ని అందిస్తే తగిన న్యాయం,రక్షణ కలుగుతుందన్నారు.అగ్నిమాపక సేవలు గూర్చి వివరించారు.తదుపరి వారోత్సవాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజలకు కూడా అవగాహన కల్పించారు.ఏప్రిల్ 14 వ తేదీ నుండి 20 తేదీ వరకు 7 రోజులు పాటు జరిగే ఈ ఫైర్ వారోత్సవాలలో భాగంగా పట్టణంలోని పలుచోట్ల వారోత్సవాల యొక్క అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలకు అగ్ని ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కోట అగ్నిమాపక కార్యాలయ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.