swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 10:17 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

బి.వై.ఎఫ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు రంగం సిద్ధం

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 6

కోట మండలం కోటలో బహుజన యూత్ ఫోర్స్ బి.వై.ఎఫ్ నాయకులు ఏప్రిల్ 11వ తేదీ జరగబోయే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల కార్యచరణ గురించి సమావేశం నిర్వహించారు.బహుజన యూత్ ఫోర్స్ మరియు బహుజన సమాజ్ పార్టీ, మరియు భాంసెఫ్ నాయకులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఏప్రిల్ 11వ తేదీ కోటలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు.గూడూరు నియోజకవర్గ ప్రజలు జయంతి వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా వారు పిలుపునిచ్చారు. అనంతరం తూపిలి గ్రామానికి చెందిన బహుజన యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులైన ఆనం నవీన్ పుట్టినరోజు వేడుకలను కమిటీ సభ్యుల నడుమ కేక్ కట్ చేయించి నవీన్ కు పూల మాలలు శాలువలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బహుజన యూత్ ఫోర్స్ నాయకులు,బహుజన సమాజ్ పార్టీ నాయకులు,భాంసెఫ్ నాయకులు భారీగా పాల్గొన్నారు.